బాలాజీ జిల్లా వద్దు – తిరుపతి జిల్లానే ముద్దు: జనసేన

తిరుపతి జిల్లాగా నామకరణం చేయాలని గరుడ విగ్రహం వద్ద కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ప్రార్థించారు. తిరుపతి నగరంలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద శనివారం జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి వినూత్న నిరసన తెలియజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాను బాలాజీ జిల్లాగా పేరు పెట్టడం బాధాకరమని, తిరుపతి జిల్లాగా కొనసాగాలని అందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి బుద్ధిని ప్రసాదించాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రఖ్యాతి గాంచిన తిరుపతి తిరుమల దేవస్థానం పిలుస్తారు అని బాలాజీ పేరుతో ఎవరు పిలవరని కనుక ప్రజలందరూ తిరుపతి అనే పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, హేమ కుమార్, సుమన్ బాబు, బలరాం, రమేష్, మునస్వామి, వనజ, కీర్తన, అమృత, లత, చరణ్, మనోజ్, కిషోర్, బాల, కోమల్, కార్తిక్, తదితరులు పాల్గొన్నారు.