నూజివీడును విజయవాడ జిల్లాలోనే ఉంచాలి

*జనసేన ఆధ్వర్యంలో నూజివీడు విజయవాడ జిల్లాలో ఉంచాలని పాదయాత్ర ఆర్డీవో కి వినతి పత్రం

నూజివీడు ను ఏలూరులో కలపొద్దు అని విజయవాడ జిల్లాలోనే ఉంచాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చిన్న గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆర్.డి.ఓ కార్యాలయం వరకూ పాదయాత్ర చేసి ఆర్.డి.ఓ రాజ్యలక్ష్మి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ నాయకులు మరీదు శివరామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపాలనే ఆలోచన ఉపసంహరించుకుని విజయవాడ జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై అన్ని రాజకీయపక్షాలు ఏలూరు వద్దు అని స్పందించిన నూజివీడు ఎమ్మెల్యే ఏలూరులో కలపడాన్ని సమర్థించటం సిగ్గుచేటు అన్నారు. మేక ప్రతాప్ అప్పారావు తన మంత్రి పదవి కోసం నూజివీడు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నూజివీడు మండలం అధ్యక్షులు యర్రంశెట్టి రాము, చాట్రాయి మండలం అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, జనసేన నాయకులు ఏనుగుల చక్రి, ఎం సునీల్ కుమార్, నీట్ల ఉమామహేశ్వరి, తుమ్మల జగన్, వలసపల్లి రామకృష్ణ, యుస్మార్ట్ ఉమా, పొన్నూరు రాము, శ్రీకాంత్, ఇంటూరి చంటి, చేన్నా పవన్ కస్తూరి, అశోక్, తోట మల్లేశ్వరరావు జక్కుల ధనుంజయ గారు, జక్కుల ప్రసాద్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-02-at-5.54.57-PM-1024x572.jpeg