నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలి

రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తునందునే ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని.. చిత్తశుద్ధి ఉంటే నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలని టీజేఎస్ అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. తనను తాను రక్షించుకోవటానికే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని, ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన అంశాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల కోసమే నిరుద్యోగులను కేసీఆర్ మభ్యపెడుతున్నారని ఉద్యోగాల ఖాళీల భర్తీ జరుగుతోందని మాకు నమ్మకం లేదని కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థ తేలకుండా ఉద్యోగాలు భర్తీ చేయలేరని, కమిటీ పేరుతో కాలయాపన చేసే కుట్ర చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు.