యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో అన్నప్రసాద సమర్పణ

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: హత్యరాల గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అక్కడికి వేలాదిమంది భక్తులు అధికసంఖ్యలో విచ్చేసిన భక్తులకు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో గొప్ప అన్నప్రసాద సమర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహకులు పాండు రాజు, కడిమిళ్ళ సుబ్బరాజు, రాజేష్ వర్మ, సుబ్బనరసయ్య, పెంచల్ రాజు, పాండు రాజు, నాగేంద్ర రాజు, సుబ్రహ్మణ్యం రాజు, జె.శ్రీనివాసులు, కె.భరత్, సునీల్ మరియు జనసేన నాయకులు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్‌, పత్తి నారాయణ, నాదాసు రామచంద్ర, మౌల తదితరులు పాల్గొన్నారు.