ప్రజా ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలి: ఎమ్మిగనూరు జనసేన పార్టీ

ఎమ్మిగనూరు, జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, మరియు రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్ లు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రజలు నీళ్లు కలుషితంతో జ్వరము మరియు దగ్గు లాంటి రోగాలతో బాధ పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్, స్పందించి ఈ సమస్యకు గల కారణం అధికారులు అన్వేషించాలని… అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణం నందు ఫీవర్ సర్వే నిర్వహించి దగ్గు, జలుబుతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు చేసి మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వినయ్, వెంకటేష్, షబీర్, ఉరుకుందు, తదితరులు పాల్గొన్నారు.