మామిడికాయ పండుగలో పాల్గొన్న గేదల చైతన్య

పాతపట్నం, మెలియాపుట్టి మండలం, సవర చీడిపాలెం గ్రామంలో మామిడికాయ పండుగల సందర్బంగా ఆ ఊరు గ్రామస్తులు మరియు ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక సంఘం జిల్లా అధ్యక్షులు సవర చొక్కారావు గిరిజన సంప్రదాయంలో ఈ పండుగ ఒక భాగంగా భావించి, పూర్వీకుల నుండి వస్తున్న ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నామని తెలిపారు. కావున మా ఆహ్వానం మేరకు చొక్కారావు వారి అధ్యక్షతన జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జి గేదల చైతన్య హాజరై గ్రామ దేవతని దర్శనం చేసుకోవడం జరిగింది. అనంతరం గ్రామ ప్రజలు మరియు యువత సమక్షంలో గౌరవ సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుక్క బాలారాజు, సవర రామూర్తి, లక్ష్మిపురం కిరణ్, ప్రశాంత్, కృష్ణ, దుర్గా మరియు జనసైనికులు పాల్గొన్నారు.