జనసేన నిరసనతో 24 గం.లలో స్పందించిన అధికారులు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా పట్టణ ప్రవేశ మార్గంలో కొన్ని నెలలుగా గుంతలమయమైన రోడ్డు బాగు చెయ్యాలని శుక్రవారం చేపలు పడుతూ వినూత్న నిరసన తెలిపి, 3 రోజుల్లో ప్రభుత్వం రోడ్డు బాగు చెయ్యకపోతే జనసేన సొంత నిధులతో రోడ్డు వేస్తామని డిమాండ్ చేయడంతో స్పందించిన అధికారులు 24 గం.ల లో శ్రీకాళహస్తి పట్టణం ఏపీ సీడ్స్ వద్ద గుంతలమయమైన రోడ్డును బాగు చెయ్యడం జరిగింది. 24 గం. లో స్పందించి ప్రజల సమస్య పరిష్కరించిన ప్రతి ఒక్క అధికారులకు వినుత ధన్యవాదములు తెలిపారు.