ఎమ్.ఎస్.స్వామినాథన్ ఆత్మకు శాంతి చేకూరాలి

  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: హరిత విప్లవ జ్యోతి.. దేశ ‘ఆహార భద్రత’ కీర్తి కిరీటి ఎమ్.ఎస్.స్వామినాథన్ ఆత్మకు శాంతి చేకూరాలని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్.ఎస్.స్వామినాథన్ కు ఘన నివాళులు అర్పించిన జయరాం రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మరణం అంతులేని ఆవేదన కలిగించింది. మన దేశం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో స్వామినాథన్ గారు చేసిన విశేషమైన కృషి కోట్లాది మంది జీవితాలను మార్చి వేసింది, దేశానికి ఆహార భద్రతను కల్పించింది. ఆకలి నిర్మూలన ఆహార భద్రత లక్ష్యాల కోసం అహర్నిశలు పనిచేసిన గొప్ప దురంధరుడు స్వామినాథన్ గారు. జయహో స్వామినాథన్.. జయహో స్వామినాథన్…. మీ సేవలు చిరస్మరణీయం అని జయరాం రెడ్డి కొనియాడారు.