అధికారంలోకి రాగానే సమస్యలను హుటహుటీన పరిష్కారిస్తా: మాకినీడి శేషుకూమారి

పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి స్థానిక పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువులో ఆమె పర్యటించి, స్థానికుల సమస్యలు, వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు వారికి ఉన్న రోడ్డు, కుళాయి, వీధి దీపాలు సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేనకు పిఠాపురం నియోజకవర్గం మొత్తం విశేష స్పందన లభిస్తుందని ఆన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మూడున్నర సంవత్సరాలకు పైగా ఈ ఇబ్బందులు అనుభవించిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నారని ఇది జనసేన గెలుపుకు శుభ సూచకమని ఆమె అన్నారు. జగ్గయ్య చెరువు ప్రజలు వారికున్న మురుగు నీటి మరియు రోడ్డు సమస్య గురించి వివరించారు. సమస్యపై ఆమె మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటి సిబ్బందిని, మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో గెలిచింది కుర్చీలో కూర్చోవడానికి కాదు అని, వారికి ఉన్న సమస్యలు పరిష్కరించి, వారికి సేవ చేయడానికి మిమ్మల్ని అందలం ఎక్కించారు అని అన్నారు. ప్రజలు అనుభవిస్తున్న అద్వాన్న పరిస్థితిని వివరించి, వీరికి ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన నాయకులకు, ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుర్ర సూర్య ప్రకాష్, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, నామా సాయి బాబు, రాజు, సూరిబాబు, అప్పన్న, జన సైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.