వన్ డే శాలరీ ఫర్ జనసేన సక్సెస్ మీట్

ఆమదాలవలస నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వన్ డే శాలరీ ఫర్ జనసేన కార్యక్రమం విజయవంతము అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా విజయవంతం చేసిన టీమ్ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసేందుకు గాను సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమదాలవలస నియోజకవర్గ జనసేన నాయకులు కోరుకొండ మల్లేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమాములో నాకు కూడా అవకాశం కలిగినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని, ఈ కార్యక్రమం అన్ని విధాలుగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నానని తెలిపారు.