ఓన్లీ బీఐఎస్‌ మార్క్ హెల్మెట్‌

వాహనదారులకు ముఖ్యమైన గమనిక. కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ రూల్స్‌ను మరింత కఠినతరం చేయనుంది. ఇకనుండి హెల్మెట్‌ ను రోడ్ సైడ్ లేదా ఎక్కడ కొనుగోలు చేసినా హెల్మెట్‌పై బీఐఎస్ మార్క్ ఉండాలి. హెల్మెట్‌పై ఈ మార్క్ లేకపోతే పెనాల్టీ పడుతుంది.

కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత బీఐఎస్‌ మార్క్ లేని హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం జరిమానా కట్టాల్సిందే. కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్‌కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే వాహనదారులు ఉపయోగించాలి.

ఈ కొత్త రూల్ 2021 మార్చి 1 నుంచి అమలులోకి వస్తుంది. హెల్మెట్ కొనే వారు మాత్రమే కాకుండా బీఐఎస్ మార్క్ లేనటువంటి హెల్మెట్లను తయారు చేసే వారికి కూడా జరిమానా పడుతుంది. అంతేకాకుండా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు.