వైసీపీతో ఇక బహిరంగ యుద్ధమే – మర్రాపు సురేష్

  • వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేద్దాం
  • జనసేన శ్రేణులు పోరాటానికి సిద్ధం కండి.
  • జనసేన జిల్లా సీనియర్ నాయకులు – మర్రాపు సురేష్

గజపతినగరం నియోజకవర్గం, జనవాణి కార్యక్రమం నిమిత్తం ఉత్తరాంధ్రా పర్యటనకు వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన జననీరాజనం చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ నాయకులు జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగిందని, వైఎస్సార్సీపీ నాయకులు పెట్టిన ఉత్తరాంధ్రా గర్జన విఫలమవడంతో జనసేనపైన, నాయకులపైన, జనసైనుకులపైన బురదచల్లే ప్రయత్నాలు చేసి, అక్రమకేసులు బనాయించి అధికార మదంతో ఐపిఎస్ అధికారులను పావుల్లా వాడుకొని అధికారాన్ని దుర్వినియోగపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు, మీతాటాకు చప్పుళ్లకు జనసేన భయపడేది లేదని అదినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు మేమంతా యుద్దానికి సిద్దంమని హెచ్చరించారు, పవన్ కళ్యాణ్, జగన్ రెడ్డిలా జైల్ నుండి రాలేదని, ప్రజలనుండి బలమైన సిద్ధాంతాలతో వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అందుకే జనసేనలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తన్నారని జనసేన జిల్లా సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ అన్నారు.