మైలవరంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగినది. కార్యక్రమంలో భాగంగా.. కొందరు వ్యక్తులను జనసేన పార్టీలోకి పండుగ కప్పి స్వాగతం పలకడం జరిగినది. ఈ కార్యక్రమం గురు సురేష్ ఆధ్వర్యంలో జరిగినది. జనసేన పార్టీలోకి జనసైనికులు కే కిరణ్ కుమార్, ఏ అమర్నాథ్, మహేష్, అజయ్, ప్రమోద్ వీరికీ జనసేన కండువా కప్పి జనసేన పార్టీ ఆఫీస్ నందు స్వయంగా జనసేన పార్టీలోకి జనసేన ముదిరాల నాయకులు గురు సురేష్ యాదవ్ స్వాగతం పలకడం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల యాత్ర 30 కోట్ల వాల్ పోస్టర్లు తీసుకుని ఊరిలో వీధి వీధికి తిరిగి ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.