పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ ఇవ్వడమే మా లక్ష్యం: మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని నియోజవర్గ ప్రజలు జనసేన పార్టీని దీవించాలని అభ్యర్థించే కార్యక్రమం పిఠాపురం మండలం, మల్లం గ్రామం నుండి మొదలుపెట్టి ప్రజలకు జనసేన సిద్ధాంతాలు మరియు షణ్ముఖ వ్యూహంతో కూడిన కరపత్రాన్ని వారికి అందించి, వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నియోజకవర్గం గ్రామాల్లో ప్రతి గడప గడప కు వెళ్లి జనసేన పార్టీ యొక్క ఆశయాలు వివరించడానికి పాద యాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రకు మేము సైతం అంటూ పిఠాపురం నియోజకవర్గ జనసైనికులు పెద్ద యెత్తున పాల్గొని పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాదవల్లభుడు ఆశీస్సులతో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గం అంతా పర్యటించి జనసేన ప్రభుత్వ అధికారం దక్కించుకునే విధంగా అడుగులు వేశారు. మల్లం గ్రామం ఆడపడుచులు శేషు కూమారికి అడుగడుగునా మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా శేషుకూమారి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని యావత్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకొని, ఈసారి జనసేన విధి విధానాలను ప్రజలకు అవగాహన కల్పించి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసే దిశగా నడుం బిగించామని, పిఠాపురం మండలం మల్లం గ్రామం నుంచి మొదలుపెట్టడం జరిగింది అన్నారు. ఇదే విధంగా ప్రతిరోజూ నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండడానికి వ్యూహాతమకంగా ప్రణాళిక రూపొందించాం అని, దానికి అనుగుణంగా జనసైనికులు, నాయకులు సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మల్లం నాయకులు ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యాకరావు, బీసీ నాయకులు యండ్రపు శ్రీనివాస్, పిఠాపురం రూరల్ కార్యదర్శి బుర్ర విజయ్ కు, గ్రామస్తులకు, నాయకులకు, జనసైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి రసంశెట్టి కన్యాకరావు, బీసీ నాయకులు యండ్రపు శ్రీనివాసరావు, పిఠాపురం రూరల్ కార్యదర్శి బుర్రా విజయ్, మండల నాయకుడు గోపు సురేష్, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరది వల్లి రామకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు, గొల్లప్రోలు మండల మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజి, గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు వినుకొండ శిరీష, పెనుకొండ సోమేశ్వరావు, కసిరెడ్డి నాగేశ్వరరావు, కళ్ళ రాజు, బొద్దిరెడ్డి భీమరాజు, కంద సోమరాజు, తిర్రంసెట్టి విష్ణు, యేసు మాణిక్యం(రాజు), శ్రీధర్, అది, భూపతి, వీరబాబు, లక్ష్మణ్, పనిగపల్లి సురేష్, దోనే సూర్య, సుబ్బారావు, గొల్లపల్లి గంగ, మైనబత్తుల చిన్న, పెద్దిరెడ్ల భీమేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గారపాటి శివ కొండలరావు, అడపా నూకరాజు,అడబాల వీర్రాజు పెద్ద ఎత్తున నాయకులు, గ్రామ జనసైనికులు, వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు.