మన పంచాయితీ మన బాధ్యత

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, జనసేనపార్టీ నిర్వహించే మన పంచాయితీ మన బాధ్యతలో భాగంగా శుక్రవారం మొదటి సారిగా అల్లూరి జిల్లా జనసేనపార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా ముందుగా జి.మాడుగుల మండలం బీరం పంచాయితీ, బోయేతెలి పంచాయితీల నుంచి పలు సమస్యలపై స్థానిక నాయకులు జనసేనపార్టీ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య దృష్టికి తీసుకురావడం జరిగింది. నియోజకవర్గాల వారిగా పలుపంచాయితీలలో సమస్యలపై వాటి మూలాలపై స్థానిక నాయకులు మా దృష్టికి తీసుకు వస్తే వాటిపై సర్చించడానికి తద్వారా పరిస్కారం కొరకు తగిన ఆలోచన చేస్తామని వారాహి యాత్ర సెస్సన్స్ లో గిరిజన పంచాయితీల దుస్థితిపై తగిన కార్యాచరణ స్థానిక నాయకులు చేయాల్సి ఉంటుందని గంగులయ్య అన్నారు. ఈ విషయమై మొదటిసారిగా బీరం, బోయేతెలి పంచాయితీలు పలు సమస్యలపై నిర్ణయాత్మకమైన చర్చ జరిగిందని, ఇకపై ప్రతి శుక్రవారం జనసేనపార్టీ మన పంచాయితి మన సమస్యలు అనే అంశాలపై స్థానిక పంచాయితి నాయకులతో సమావేశం ఉంటుందని, జనసేనపార్టీ నాయకులు కచ్చితంగా సమస్యలు, వాటి మూలాలపై గిరిజన ప్రజలకు వాస్తవికతతో కూడిన అవగాహన కల్పిస్తునే వారికి చైతన్యం కలిగించాలని రానున్న ఎన్నికల్లో కచ్చితంగా జనసేనపార్టీ గెలిచే విదంగా ప్రజాదరణ లభిస్తుందని, గిరిజన రాజకీయాలపై మార్పు ప్రభావం కనిపిస్తుందని, ఇంకా వేగంగా జనసేన బలం పుంజుకుంటుందన్నారు. పార్టీ ఆశయాలు, లక్ష్యాలపై నిర్విరామంగా కృషి చేస్తున్న ఆదివాసీ విద్యాధికులే మనకు ప్రధాన బలమని ఆ దిశగా ఆలోచన చేసి అభ్యుదయభావాలున్న యువకులు స్వచ్ఛందంగా తమవంతు సమయం పార్టీ కోసం వెచ్చించడం హర్చించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్బంగా బీరం పంచాయితీ నాయకులు, బట్టి అంగధర్, కొర్ర రవి, కొర్ర సింహాద్రి, బోయేతెలి పంచాయితి జి.మాడుగుల మండల గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకట రమణ, నుర్మతి పంచాయితి నాయకులు తల్లే త్రిమూర్తి, తల్లే కృష్ణ, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, సోషల్ మీడియా మరియు ఐటి టీమ్ అధ్యక్షులు అశోక్, సత్యనారాయణ, సిరగం శోభన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.