రాజాం నియోజకవర్గంలో జనసేన నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో పాదయాత్ర

శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో రోడ్లు వెయ్యండి ప్రజలు ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో ఉంగరాడ మెట్ట నుండి రాజాం వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం రాజాం నియోజవర్గంలో ప్రధాన సమస్య అయిన రాజాం- పాలకొండ ప్రధాన రహదారి చాలా గుంతలతో ప్రయాణం చేయడానికి అత్యంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. దీనికి తక్షణ చర్యలుగా గుంతలు పూడ్చి, రవాణా సౌకర్యాలు వీలుగా ఉండే విధంగా రహదారి మరమ్మతులు చేసి రాజాం నియోజకవర్గ ప్రజల ప్రాణాలు కాపాడండి అంటూ జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు ఈ పాదయాత్రలో తెలిపారు. పాదయాత్ర పొడుగునా గుంతల వద్ద నినాదాలు చేస్తూ పాదయాత్ర ముందుకు సాగించారు. ఉంగరాల మెట్ట వద్ద ప్రారంభించి రాజాం అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ఉంగరాల మెట్ట నుండి రాజాం వరకు 16 కిలోమీటర్ల రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని ఈ పాదయాత్ర సందర్భంగా తెలియపరిచారు. ఈ పాదయాత్రలో నాలుగు మండలాల జనసైనికులు, వీరమహిళలు రాజాం నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.