రెల్లి కాలనీలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జనసేన నిరసన

పెందుర్తి నియోజకవర్గం, 88వ వార్డ్, నరవ గ్రామం, పెందుర్తి నియోజకవర్గం, రెల్లి కాలనీలో ప్రజలకు మౌళిక సదుపాయాలు వీధిలైట్లు లేకపోవడం, డ్రైనేజీ క్లీనింగ్ చేయకపోవడం వలన సుమారు 50 కుటుంబాలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని సచివాలయం అడ్మిన్ కి వినతపత్రం ఇవ్వడంతో పాటు కాలనీ ప్రజలతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం రెల్లి కులస్తులకు మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యమని, అధికారులు సమాధానం చెబుతూ మా కింద వర్కర్స్ లేరు క్లీన్ చేయడానికి, వీధిలైట్లు వేద్దామంటే నిధులు లేవు అని సమాధానం చెబుతున్నారని, అధికారులు ఇలా మాట్లాడితే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలని ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా అని మాట్లాడారు. స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కాలనీలో సుమారు 50 కుటుంబాలు కొన్ని దశాబ్దాల కాలం నుండి నివసిస్తున్నారని, కనీసం వీధిలైట్లు ఏర్పాటు, మురికి నీటిని క్లీన్ చేయలేని ఈ ప్రభుత్వాలు ఎందుకని, కాలనీ ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి సచివాలయ అధికారులకు సమస్య కోసం మొరపెట్టుకున్న ప్రజలకు కాళ్లు చెప్పులు అరిగాయి గాని సమస్యకు పరిష్కారం మాత్రం చూపడం లేదని, ఈ రెల్లి కాలనీ ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచిన పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు గారు, కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు వీధిలైట్లు ఏర్పాటు చేయలేని వారికి మీకు పదవులు ఎందుకని మీరు మీ పదవులకు రాజీనామా చేసి ప్రజల వైపు నిలబడాలని జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం, మీడియా ప్రతినిధులు కూడా ఈ యొక్క రెల్లి కాలనీ సమస్యను ప్రభుత్వ దిష్టికి తీసుకొని వెళ్లి వారి సమస్య పరిష్కారానికి మీ వంతు కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాడీ పెంటారావు, శ్రీను, కాలనీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.