ఉగాది వేడుకలలో పాలకొండ జనసేన నాయకులు

పాలకొండ నియోజకవర్గం: క్రోధినామ సంవత్సర ఉగాది పండుగా సందర్బంగా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో గల శ్రీ సాయి మారుతీ ధ్యాన మందిరంలో పాలకొండ నియోజకవర్గం జనసైనికులు ప్రత్యేక పూజలు చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా తూర్పుకాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయుడు బబ్బాది పకీర్ నాయుడు మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గం ప్రజలు అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆత్మీయులైన తామెల్లరూ చేపట్టిన ప్రతి పని జయప్రదంగా ముందుకు సాగాలని, అన్ని శుభాలు కలగాలని, ధనధాన్య, ఆయురారోగ్యములతో ఉత్సాహం గౌరవం ఆనందం ధనం ఐశ్వర్యం ఇవన్నీ ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకు న్నారు జనసేన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స. పుండరీకం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు. జనసేన జానీ మాట్లాడుతూ చాలామంది అభిమానులు కార్యకర్తలు, సైనికులు, నాయకులు మగ వారు భయటకి వచ్చి పని చెయ్యడానికి భయపడుతున్నారు కానీ ఆడవాళ్ళు వచ్చి ధైర్యంగా జగన్ చేసే మోసాలపైన మాట్లాడు తున్నారు. ఇది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిదు ఏళ్లకు ఒక్కసారే మీకు మాట్లాడే అవకాశం వస్తుంది ఏమి నచ్చింది ఏమి నచ్చలేదు చెప్పండి అది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు సోషల్ మీడియా ఉందిగా దీనికి భయమెందుకు. రాజకీయ నాయకులే పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు మీకెందుకు భయం రండి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వం కోసం పాలకొండ లో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థినీ గెలిపించుకుందాం అని జనసేన జానీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సాయిపవన్, చిన్ని, రమణ, అనిల్ వీర మహిళలు పాల్గొన్నారు.