Vijayanagaram: చెల్లూరులో జనసేన ప్రజా వేదిక

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పార్టీ నేతల హామీ

విజయనగరం,గ్రామస్థాయిలో ప్రజా సమస్యలపై అధ్యయనం, వాటి పరిష్కారం ధ్యేయంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో ప్రజా వేదిక కార్యక్రమం కొనసాగుతోంది. ఆదివారం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెల్లూరు గ్రామ పంచాయితీ, రామజోగయ్యపేటల్లో ప్రజా సమస్యలపై అధ్యయనం చేశారు. స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫించన్లు, రేషన్ కార్డులు, రహదారి సమస్యలు తదితర అంశాలపై ఎక్కువగా వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా శ్రీమతి యశస్వి మాట్లాడుతూ… రామజోగయ్యపేటలో జనసేన ప్రజా వేదిక నిర్వహించామని ప్రజల నుంచి వ్యక్తిగత, స్థానిక సమస్యలపై వినతులు వచ్చాయి. వాటి పరిష్కారం కోసం జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రీ బొబ్బాద్రి చంద్రనాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికీ జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ త్యాడ రామకృష్ణారావు(బాలు), చేనేత వికాస విభాగం కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని, వీరమహిళ శ్రీమతి తుమ్మి లక్ష్మీరాజ్, శ్రీ సాయి, శ్రీ దాసరి యోగేష్, శ్రీ రవిరాజ్ చౌదరి, శ్రీ సత్తిబాబు, శ్రీ స్వామి, శ్రీ రమణ దోని, శ్రీ అనిల్, శ్రీ మురళి, శ్రీ నాగరాజు, శ్రీ శ్రీను, శ్రీ శ్రావణ్, శ్రీ రాఘవ, శ్రీ సాయి జోగేష్, శ్రీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.