అమ్మపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

  • పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 27వ రోజు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం మూడో విడత గా తిమ్మాజిపెట మండలంలో 27వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం అమ్మపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు.. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ, మండల, నాయకులు జనసైనికులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ గ్రామంలో పర్యటించారు, జనసేన పార్టీ పట్ల గ్రామంలో అపూర్వ ఆదరణ, పొందుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు.. గ్రామంలోని ప్రజలు లక్ష్మణ్ గౌడ్ కు ప్రధాన సమస్యలు వివరిస్తూ ఇంటికోక ఉద్యోగం, డబల్ బెడ్ రూమూలు, నీళ్ళు నిధులు నియమాకలు మన హక్కుల కోసం మనం పోరాటం చేసి యువకుల బలిదానాలతో రాష్ట్రం సాధించుకున్నాం.. ఇంటికొక ఉద్యోగం లేకపాయ.., ఉండటానికి గూడు లేకపాయా..? రోడ్లు లెకపాయా..? యువతను మద్యం మత్తులో ముంచేసారు.., అమ్మపల్లి నుంచి మెయిన్ రోడ్ వరకు సరైన రోడ్ సదుపాయం లేదు, అసలు రోడ్ మధ్యలో గుంతలు ఉన్నాయో, లేక గుంతల మధ్య రోడ్లు ఉన్నాయో అర్థం కావట్లేదు మాకు, ఎలక్షన్స్ వస్తే ఓట్ల కోసం మా ఊరు గుర్తొస్తది, తప్ప మాకు ఎవ్వరూ ఏమి చేసిందేమీ లేదు.. అంటూ గ్రామస్థులు లక్ష్మణ్ గౌడ్ గారితో వారి సమస్యలు మొరపెట్టుకున్నారు. ఈ యెక్క కార్యక్రమంలో చల్లా శివరెడ్డి, గగన్, పవన్, శ్రావణ్, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ నాయక్, సూర్య, వంశీ రెడ్డి, బోనాసి లక్ష్మణ్, నవీన్, పుస శివ, రాకేష్, నరసింహ, లక్ష్మయ్య, ఆంజనేయులు, నాగేష్, పవన్, శివ తదితరులు పాల్గొన్నారు.