పవనన్నతోనే సామాన్యులకు న్యాయం: బత్తుల

  • ప్రతి జనసైనికుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి…..
  • ఒక్కో జనసైనికుడు 10 మంది ఓటర్లను ప్రభావితం చేయాలి..
  • రాష్ట్ర సుభిక్షం కోసం వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం..
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం..
  • ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై భరోసా,నమ్మకం లేదు..
  • పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారిని అభినందించిన ‘అనపర్తి (వీరంపాలెం) నియోజకవర్గ’ జనసైనికులు..
  • రానున్న ఎన్నికల్లో రాజానగరం నియోజవర్గంలో జనసేన పార్టీదే గెలుపు….
  • మహిళలు స్వశక్తి మీద ఆధారపడేలా పవన్ కళ్యాణ్ గారి పాలన ఉండబోతుంది…
  • జనం కోసం జనసేన మహాపాదయాత్ర 86వ రోజు

రాజానగరం: జనం కోసం జనసేన మహాపాదయాత్ర.. ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం…. రాజానగరం మండలం, మల్లంపూడి గ్రామంలో.. జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, వీరమహిళల సారధ్యంలో.. గ్రామ ప్రజల విశేష ఆదరణతో విస్తృతంగా, ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది, మహిళలు హారతులు పడుతూ… జనసైనికుల కేరింతలతో, గ్రామపెద్దల ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిండుగా కొనసాగింది.. ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వంపై భరోసా, నమ్మకం లేదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, సమిష్టిగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జనసైనికులు కష్టపడాలని, ఒక్కో జనసైనికుడు పదిమంది ఓటర్లను ప్రభావితం చేసేలా టార్గెట్ పెట్టుకోవాలని, వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించినప్పుడే ఈ రాష్ట్రానికి రాక్షస పాలన నుండి విముక్తి లభిస్తుందని, నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చెరువులు, కొండలు, గుట్టలు, ఇసుక దోపిడీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాల మీద, నియోజకవర్గ అభివృద్ధి మీద లేదని.. రానున్న ఎన్నికల్లో ఆయనకు రాజానగరం నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని, దీనికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని.. ఈ “మహాపాదయాత్ర”ను విజయవంతం చేస్తున్న వీరమహిళలకు, జనసైనికులకు, మల్లంపూడి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అన్నారు.. రాత్రి 10 గంటల వరకు ఉదృతంగా, ఉత్సాహంగా కొనసాగినఈ “మహాపాదయాత్ర”లో మల్లంపూడి గ్రామ ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.