పార్వతీపురం మున్సిపాలిటీ జనసేన ఆత్మీయ సమావేశం

  • 30వార్డులలో కార్యకర్తలు, కో-ఆర్డినేటర్స్ తో ఆత్మీయ సమావేశం.
  • వార్డ్ లో ప్రజలకు రాజకీయ వాస్తవాలు తెలియజేయమని ఆదేశాలు.
  • ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపైన చర్చ
  • జనసేన – తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు అలానే ఉంటాయి.

పార్వతీపురం మున్సిపాలిటీ ఆదివారం జనసేన సీనియర్ నాయకులు చందక అనీల్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అన్ని వార్డ్ లలో ఉన్న కార్యకర్తలతో ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎలక్షన్స్ వరుకు మన బాధ్యత, పట్టణ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళవలసిన అంశాలు, వార్డ్ పర్యటన, బూత్ మేనేజ్మెంట్ అలా మరికొన్ని కీలక అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం నాయకులు, కో ఆర్డినేటర్స్ మాట్లాడుతూ వార్డ్ లో ప్రజలకు రాజకీయ వాస్తవాలు తెలియజేయాలి అని అలాగే జనసేన – తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు అలానే ఉంటాయి అని ప్రతి వార్డ్ లలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని వారి అభిప్రాయాలు వ్యక్త పరిచారు. ఈ సమావేశంలో పట్టణ సీనియర్ నాయకులు చందక అనీల్, రాజాన రాంబాబు, ఇజ్జాడ కాళీ, నెయ్యిగాపుల సురేష్, బంటు శిరీష్, మానేపల్లి ప్రవీణ్, సిరిపురపు గౌరీ, రాజాన బాలు, బోనెల గోవిందమ్మ, వంగలపుడి నాని, సొంటేన శ్రీను, పైలా శ్రీను, గునాన నరేష్, చింతాడ ముఖేష్, రౌతు బాలు, బి.గణేష్, అద్దాల కార్తీక్, ఏ.సింహాచలం, ఎం.తిరుపతిరావు, ఆర్. నారాయణ రావు, హెచ్.కిరణ్ కుమార్, జి.రాంబాబు, గోష్, ఎం.అప్పల, ఎస్ రమేష్, జి.మురళి, ఎల్ రామకృష్ణ, ఎం.శ్రీహరి, ఎం.సతీష్ కుమార్, కడగల శ్యాంసుందర్, కొల్లేపర్ తేజ, రెడ్డి సంతోష్ కుమార్, ఎల్.వరుణ్ కుమార్, కె.రమేష్, బూరెలు కిరణ్, పి.రవికుమార్, బి.వెంకీ, సంతోష్ రామ్ చరణ్, జి.ప్రసాద్, సి.హెచ్.నగేష్, జి.పవన్ కుమార్, సంబాన కూర్మ, ఈ.కృష్ణ సాయి, ప్రవీణ్, జి.వంశీకృష్ణ, కోరాడ మౌళి, భాస్కర్, టి.సుధాకర్, ఎస్.జానీ, శ్రీను, రాజ్ కుమార్, బంటువల్స రవి తదితరులు పాల్గొన్నారు.