కరప గ్రామంలో జనం కోసం పవన్-పవన్ కోసం మనం 2వ రోజు

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, కరప గ్రామంలో గ్రామ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రెండవ రోజు నక్క వారి పేట నుండి పల్లిపేట వరకు జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.. కరప గ్రామంలో పర్యటన చేస్తున్న పంతంనానాజీకి ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు. ముఖ్యంగా నక్క వారి పేటలో మరియు పల్లి పేటలో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వారి వాడిన వాడకం నీరు మలమూత్రాలు కూడా వారే ఎత్తుకుని బయట పారబోసుకునే దుస్థితి ఏర్పడింది. కరప గ్రామంలో 10 గ్రామాలకు పైన సామూహిక త్రాగునీరు ప్రాజెక్టు ఉన్నా కానీ పరిశుభ్రమైన నీరును అందించలేకపోతున్నారు. సుమారు 300 కుటుంబాలకు అవసరమైన నక్క వారి పేట పల్లి పేటకు వెళ్లే బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా చేపట్టలేదు. గతంలో రోడ్ కం బ్రిడ్జ్ వేయవలసి ఉన్న కానీ కాంట్రాక్టర్ రోడ్డు వేసి బ్రిడ్జి నిర్మాణం వదిలేసి వెళ్లిపోయాడు. మంచినీటి చెరువును చేపలు చెరువుగా మార్చారు. 50000 రూపాయలకు పాట పాడి స్థానిక వైసీపీ నాయకులు బయట వ్యక్తులకు మూడు లక్షల రూపాయలకు బయటకు ఇచ్చారు సుమారుగా 7 లక్షల రూపాయలు మంచినీటి చెరువు మీద వ్యాపారం జరిగింది. స్థానిక ఉప్పాలమ్మ గుడి నిర్మాణానికి కోటి రూపాయలు పైన నిధులు చేకూరిన వాడికి ఇప్పటివరకు లెక్కలు లేవు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 40 లక్షల రూపాయలు గుడికి నిధులు మంజూరు అయ్యాయి కానీ ఈ గుడి ఎండోమెంట్ ఆధ్వర్యంలో జరగవలసిన గుడి కార్యక్రమాలు అన్నీ కూడా స్థానిక వైసిపి ఎమ్మెల్యే అండదండలతో స్థానిక వైసీపీ నాయకుల పరివేక్షణలో ఉప్పాలమ్మ గుడి కొనసాగుతుంది. అమ్మవారి గుడికి వచ్చిన విరాళాలుగా గ్రామస్థితి ఇచ్చిన లక్షలాది రూపాయలు, చీరలు మొక్కుబడులను స్థానిక గుడి కమిటీ పేరుతో వైసిపి నాయకులు దోచుకుంటున్నారు. 105 సంవత్సరాల చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఆ గుడికి సంబంధించిన దాత గుడి చుట్టూ ప్రహరీ తీయడానికి ముందుకు వస్తే స్థానిక వైసీపీ నాయకులు అడ్డు తగులుతున్నారు. మత్స్యకారులకు మార్కెట్ సదుపాయం అవసరం ఉంది కానీ ఈ ప్రభుత్వ హయంలో ఇప్పటివరకు కూడా వారి హామీ నెరవేర్చలేదు. వ్యాపారం జరుగుతున్న స్థలంలో నిర్మాణం చేపట్టాలని మత్స్యకారులు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు కానీ వ్యాపారం లేని చోట మార్కెట్ కట్టి ప్రజా ధనాన్ని వృధా చేశారు. కరప గ్రామంలో హైస్కూల్లో గంజాయి వ్యాపారం జరుగుతున్నట్టు స్థానికులు తెలియజేస్తున్నారు. దీనిపై పోలీసు వారు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.