జనం కోసం పవన్ -పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గ్రామ అధ్యక్షులు, జీని శ్రీనివాస్, మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో శెట్టిబలిజ పేట, గొల్ల పేట ప్రాంతాల్లో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీగారు, మరియు టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా. ఈ గ్రామంలో పర్యటన చేస్తున్న పంతంనానాజీకి ప్రజలు
వారి సమస్యలను విన్నవించుకున్నారు. గ్రామంలో మంచి నీటి సమస్య అధికంగా ఉందని, కోరమండల్ పరిశ్రమ వారు టాంకర్ ద్వారా అందిస్తున్నారని, టాప్స్ ఉన్న సరైన నిర్వహణ లేక మంచి నీరు రావడంలేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని సరైన అనుసంధానం లేక, వర్షము వచ్చినప్పుడు ముంపుకి గురి ఔతూ, అనేక ఇబ్బందులు పడుతున్నామని, పారిశుద్యం లేకపోవడంతో దోమలు పెరిగి పోవడం తో వ్యాధులు వ్యాపిస్తున్న పట్టించుకునే వారు లేరని ఈ గ్రామానికి 12 సంవత్సరాలునుండీ స్థానిక ఎన్నికలు జరపక పోవడంతో అధికారులపాలనలో అభివృద్ధి లేకుండా పోయింది అని తెలిపారు. వీటన్నిటిని అధికారుల దృష్టికి తీసుకువెళదామని, సరైన చర్యలు చేపట్టక పోతే, త్వరలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.