పవన్ జోలికొస్తే జనసైనికుల ఆగ్రహజ్వాలలో మాడిపోతారు

పిఠాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై హత్య కుట్ర చేస్తున్నారని వచ్చే వార్తలపై పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి మాకీనీడి శేషకుమారి మాస్ వార్నింగ్ తో మీడియాలో మండిపడ్డారు. ఇటీవల నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమంలో కొంతమంది అల్లరి మూకలు చేసి దాడి యత్నానికి స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ మీట్ ద్వారా స్పందించారు. రాజకీయంగా ఎదురుకోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. ఆంధ్రాలో అభిమానులలో ఉన్న క్రేజ్, పార్టీని ప్రజలు ఆదరిస్తున్న తీరును చూసి ఓర్వలేక చాటుగా దెబ్బతీయలని చూస్తే ఒక్కొక్క జనసైనికుని ఉగ్రరూపం చూస్తారని అధికార ప్రతినిధులు ఎంత రెచ్చగొట్టినా ఎంతో సహనంతో ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చేతగానితనమన్నారు. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి డబ్బులు ఉండవు కానీ, హత్యలు చేయడానికి 250 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్నారు. తమ ఆధినేత హత్యాయత్నాలు చేయడానికి ప్లాన్ చేస్తున్న కిరాయి గూండాల నుండి రక్షణ కేంద్ర ప్రభుత్వం కల్పించాలని ఆమె కోరారు. కుట్రకు కారకులను దర్యాప్తు వేగవంతం చేసి కస్టడీలో తీసుకుని అసలు సూత్రాదారులను తెలుసుకుని కఠిన చర్యలు చేబట్టాలని డిమాండ్ చేసారు.