నీతి, నిజాయితీతో నిబద్ధతగా పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్: శీలం బ్రహ్మయ్య

మైలవరం, స్థానిక జనసేనపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ, ఇటీవల కాలంలో వైఎస్సార్సిపి నాయకులు పవన్ కళ్యాణ్ పైన ఆయన వ్యక్తిగత జీవితం పైన దిగజారి విమర్శిస్తున్నారని, అలాంటి వారికి మాత్రమే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో చెప్పు చూపిస్తూ, దిగజారుడు మాటలు మాట్లాడిన వారిని హెచ్చరించారని గుర్తు చేశారు. 2019 ఎలక్షన్ టైం నుంచి పవన్ కళ్యాణ్ ని హతమార్చాలని కొన్ని దుష్టశక్తులు దాదాపు 250 కోట్ల రూపాయల డీల్ ను కుదుర్చుకున్నారని కేంద్ర నిఘా వర్గాలు సమాచారం సేకరించే, పనిలో ఉన్నాయని మీడియా ద్వారా విన్నానని, ఇది చాలా దారుణమైన విషయమని, ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలకు సేవచేసే ఉద్దేశంతో నీతి, నిజాయితీతో నిబద్ధతగా పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ అని, కొన్ని దుష్టశక్తులు ఆయనపైన కుట్రలు పన్నాయని, కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం పవన్ కళ్యాణ్ విషయంలో శ్రద్ధ చూపాలని, ఆయనకు భద్రత కల్పించాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమని, అందువలనే పవన్ టార్గెట్ గా మారారని, అవసరమైతే ప్రతిరోజు జనసైనికులు ఆయనకు సెక్యూరిటీగా నిలబడతారని, కుట్రదారులకు భయపడబోమని హెచ్చరించారు.