ప్రపంచపటంలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసే క్రీడాకారులను పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ప్రోత్సాహిస్తారు

•పార్టీ రాష్ట్ర నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, వడ్రాణం మార్కండేయ బాబు

గుంటూరు సిటీ, క్రీడలలో అద్భుతమైన ప్రతిభ చూపిన క్రీడాకారులను పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ప్రోత్సాహిస్తారని, దానికి నిదర్శనమే రషీద్ కి ఆర్ధిక సాయం అందించడం అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్రాణం మార్కండేయబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్” ఛారిటబుల్ ట్రస్ట్ తరపున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయంగా ప్రకటించిన రూ.2,00,000/- లక్షల రూపాయల చెక్కును గుంటూరులోని రషీద్ నివాసానికి వెళ్ళి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, పార్టీ సీనియర్ నాయకులు చింతా రేణుకారాజు అందజేశారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరలోనే గుంటూరులో రషీద్ కుటుంబాన్ని కలుస్తానని పవన్ కళ్యాణ్ గారు పంపిన సందేశాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు కొరిటిపాటి ప్రేమ్ కుమార్, ఆకుల వీరరాఘవయ్య, విష్ణుమొలకల ఆంజనేయులు, బిట్రగుంట శ్రీనివాస్, కల్లగంటి త్రిపుర, దళవాయి భార్గవ్, డేగల వెంకటేశ్వర రావు, బండి రామప్రభు తదితరులు పాల్గొన్నారు.