నెల్లూరులో కాప్ రాక్స్ కార్తీక వన భోజనాలు

నెల్లూరు: కాప్ రాక్స్ కార్తీక వన భోజనాలు నెల్లూరులో కస్తూరిబా కళా క్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మందుగా సభ్యులతో సామూహికంగా గాయత్రి హోమం నిర్వహించి, హోమంలో పాల్గొన్న వారికి ఉచితంగా వెండి కాయిన్స్ పంచి, పవిత్ర నదీ నదీ జలాలతో శివుని లింగ అభిషేకం చేయించారు. అనంతరం సంస్కృతిక, వినోద కార్యక్రమాలు, గేమ్స్ నిర్వహించి అందులో గెలిపిన వారికి బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొంగూరు నారాయణ కాప్ర్ రాక్స్ పిఆర్ఓ పసుపర్తి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా పసుపర్తి కిషోర్ మాట్లాడుతూ.. 8 సంవత్సరాల కిందట కాప్ రాక్స్ ఫౌండర్ శివ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ గ్రూపు 5 లక్షల 50 వేల మందితో ఒక శక్తిగా మారింది. సామాజిక మధ్యమాలలో ఏదైనా అవసరం అని పోస్ట్ పెడితే వెంటనే స్పందించి అనేక సేవలందించ గలుగుతున్నాం.. యంగ్ ఇండియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒకటిన్నరకోటిపై కోటి రూపాయలు పైగా పేద విద్యార్థులకు చదువుకోడానికి స్కాలర్షిప్ అందజేశాం. ఆరు సంవత్సరాల ముందు ఇది పైకి లేచి మాట్లాడడానికి సిగ్గుపడే గునుకుల కిషోర్ ఈరోజు నాయకుడిగా అందరి సమస్యలు తీరుస్తున్నాడు.. ఈ గ్రూపు ద్వారా జరిగే సేవలను కూడా నిస్వార్ధంగా ఎవరూ ఒక్క రూపాయి ఆశించి చేసేది కాదు. గ్రూప్ సభ్యులు ఒకరికొకరు ఉపయోగపడి వారు మరింత మందికి సేవ చేసే విధంగా ముందుకు సాగుతున్న ఈ గ్రూపు మరింత పేరు ప్రఖ్యాతలు పొందాలని పేర్కొన్నారు. పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ తో తెలుసుకుని సలహాలు, సూచనలు అందిస్తూ మందుకు సాగుతున్న గ్రూపు సేవలు అభినందనీయం.. డిజిటల్ లోకంలో దాదాపు 5 లక్షల మంది గ్రూపు సభ్యులను కలిగి పరస్పర సహకారం తో సాగుతున్న ఈ గ్రూపు రోజుల్లో మరిన్ని సహాయ సహకారాలు అందే విధంగా చూస్తామని మాటిచ్చారు. గత ఎన్నికల లో అందరి సభ్యులను చేరుకోలేక పోయాను. ఇప్పటికే 50% ప్రజల్లో ఉంటున్నాను. మిగిలిన 50% కూడా ఎన్నికల లోపల పూర్తి చేస్తాను. గతంలో కాపు కమ్యూనిటీ కి రాష్ట్రవ్యాప్తంగా ఆర ఎకరా మాత్రమే కేటాయించమని సూచించగా.. నెల్లూరులో తాన మంత్రిగా ఉన్నప్పుడు మూడున్నర ఎకరాలు కమ్యూనిటీ కోసం కేటాయించి అక్కడ భవన నిర్మాణానికి కూడా ఆర్థికంగా సహకరించడం జరిగిందని పేర్కొన్నారు. గాదిరాజు అశోక్ మాట్లాడుతూ గతంలో నారాయణ కమ్యూనిటీకి అందుబాటులో లేకపోవడం వలన ఓడిపోవడం జరిగింది. ఈ సారి కమ్యూనిటీ అంతా కూడా దగ్గరుండి ఆయన ను గెలిపించుకుంటామని.. వారు కూడా అందుబాటులో ఉండి అందరికీ ఉపయోగపడాల్సిందిగా సూచించారు.
కాపుల భవనానికి స్థలాన్ని కేటాయించడమే కాక ఆయనకు గుర్తుందో లేదో దాదాపుగా కోటి 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఆ భవన నిర్మాణానికి కూడా కారణమయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ దంపతులు తో పాటు, కాప్ రాక్స్ పి ఆర్ ఓ పసుపర్తి కిషోర్ దంపతులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ దంపతులు, నోవా బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలందిస్తున్న భావిశెట్టి కిషోర్ దంపతులు, వరుణ్, శివ, భూపతి రాఘవన్న, బొట్టు బాబన్న, జనసేన పార్టీ కావలి నియోజకవర్గం ఇంచార్జ్ అలహరి సుధాకర్, దిలీప్, తెలుగుదేశం పార్టీ నాయకులు చెక్కా సాయి సునీల్, మామిడాల మధు, శ్రీనివాసులు, రమణయ్య, ఇతర కాపు నాయకులు కాప్ రాక్స్ సభ్యులు, బీస్ ఎంప్లాయిస్ నాయకులు అనీల్, నాగేశ్వర రావు, రాజరాజేశ్వరి గుడి దేవస్థాన చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు.