వైసిపి పేటియం బ్యాచ్ వాలంటీర్లను రెచ్చగొడుతుంది

గూడూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వైసిపి పేటియం బ్యాచ్ వాలంటీర్లు రెచ్చగొడుతున్నారని గూడూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పెద్ది శెట్టి ఇంద్ర వర్ధన్ అన్నారు. గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి జనసైనికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారం అసాంఘిక శక్తులకు చేరుతుందని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగిందని, కానీ వైసీపీ నాయకులు వాలంటీర్లు తప్పుదోవ పట్టిస్తూ పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం తగదన్నారు. కనిపించకుండా పోయిన మహిళలు బాలికలు ఏమయ్యారు అనే విషయాలపై ఇప్పటివరకు డీజీపీ గానీ, సీఎం గానీ ఎలాంటి సమీక్ష నిర్వహించడం జరగలేదన్నారు. కాగ్ లెక్కల ప్రకారం లక్ష 18 వేల కోట్లు ఏమయ్యా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని కానీ వాటికి వైసిపి నాయకులు వద్ద సమాదానం లేదన్నారు. కూల్చివేతల ప్రభుత్వం మరొక్కసారి అమానుషానికి ఒడిగట్టిందని. అమాయకులైన వాలంటీర్లను భయపెట్టి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెబుతూ గూడూరు పట్టణం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ పోస్టర్ను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వాలంటీర్ల పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం 5000 వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటుంది. నాలుగేళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా ఐదు వేల జీవితానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరని ప్రశ్నించారు. వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వం ఉద్యోగాల ఉసేత్తకుండా మీ వయస్సు అర్హత లో నాలుగేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు?, మీ జీవితాలు ఎదిగే అవకాశాలు లేకుండా చేసే 5,000 దగ్గరే ఉంచింది ఎవరు?, వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదు వారిని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారు అనేది వాస్తవం కాదా, వైసీపీ సభలు సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే బాధ్యత మీపై వేశారా లేదా, మీ ప్రాంతాల్లో ప్రజలను మీ చేతే భయపెట్టిస్తున్నారా లేదా గ్రామ వాలంటీర్లు, మీ జీవితాలు అభివృద్ధి లేకుండా చేస్తున్నది ఈ ప్రభుత్వమే ఆలోచించండి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్, సాయి, శివ, వసంత్, అవినాష్, రాకేష్, మోహన్, శ్రీనాథ్, సనత్, ధనుంజయ్, వెంకటేశ్వర్లు, పెంచలయ్య, అచ్చి, షారుక్, కుమార్, వెంకటేష్, శివ, నాని, వరుణ్, జనసేన కార్యకర్తలు మరియు జనసైనికులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.