సేవలో పవన్ కళ్యాణ్ మాకు స్ఫూర్తి

  • జనసేన లక్ష్యం కూడా సేవే
  • ప్రజలకు పల్లకి మోయడమే మా భాద్యత
  • జనసేన ఇంచార్జి డా యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ప్రమాదంలో గాయపడిన ఎస్ ఆర్ పురం మండలం, ఎగువ ముద్ది కుప్పం గ్రామ జనసైనికుణ్ణి రుయా ఆసుపత్రిలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జి డా యుగంధర్ పొన్న పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డా యుగంధర్ పొన్న మాట్లాడుతూ సేవలో పవన్ కళ్యాణ్ మాకు స్ఫూర్తి అని, జనసేన లక్ష్యం కూడా సేవే అని పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడారు. ప్రజలకు పల్లకి మోయడమే మా భాద్యత ని కూడా తెలిపారు. ప్రజా సేవలో జనసేన అన్నింటిలో ముందుంటుందని తెలిపారు. కులం, మతం, భాష, ప్రాంతం బేదాభిప్రాయం లేకుండా నిరుపేదలకు అండగా నిలబడుతుందని తెలియజేసారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే జనసేన నైజమని తెలిపారు. అధికారులు జెండా ఎగరేస్తే అది ఆనవాయితీ, ప్రజలు జెండా ఎగరేస్తే అది పండగ, ప్రజలే జెండా ఎగరేసే రోజు రావాలి, జనసేనతోనే అది సాధ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జనసేన సీనియర్ నాయకులు రమాదేవి, ఎస్ ఆర్ పురం మండల ఉపాధ్యక్షులు సుధాకర్, చంద్ర, కార్యదర్శి జాఫర్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు ఖాదర్ పాల్గొన్నారు.