భారతదేశంలో తెలుగు వారందరికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే

కడపజిల్లా, రాజంపేట నియోజకవర్గం సిధ్ధవటం మండలం న్యూస్, పవన్ కళ్యాణ్ ని జగన్ దత్తపుత్రుడు అన్న దానికి కౌంటర్ గా నేడు మండల నాయకులు కొట్టే వెంకట రాజేష్ మీడియాతో మాట్లాడడం జరిగింది. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కాదు నీవు కేసీఆర్ కు దత్తపుత్రుడివి జగన్. హైదరాబాద్ ఉమ్మడి ఆస్థులు గురించి కేసీఆర్ తో మాట్లాడి రాష్ట్రానికి రావలసిన ఆస్థులను ఎందుకు తీసుకురాడం లేదు? గట్టిగా మాట్లాడితే సీబీఐ కోర్టులో నిన్ను వేయిస్తాడనే భయంతో నీవు కేసీఆర్ కు దత్త పుత్రుడివిగా వున్నావ్, మా నాయకులు పవన్ కళ్యాణ్ ఎటువంటి మచ్చలేని తెల్ల కాగితం లాంటి వారు ఏమీ విమర్శించేదానికి లేక దత్తపుత్రుడు అనే పదం వాడుతున్నావా..? నిజమే మా నాయకుడు భారతదేశంలో ఎక్కడ తెలుగువారు వున్న వారందరికీ దత్తపుత్రుడే ఇకనైన పనికి మాలిన మాటలు ఆపేసి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయండి ఖచ్చితంగా జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది. వ్యక్తి గత విమర్శలు చేశారంటే దానికంటే ఎక్కువుగా మేము చేయవలసి వస్తుంది ఆలోచించుకోండి జగన్ అని అన్నారు.