కలియుగ దానకర్ణుడు పవన్ కళ్యాణ్

  • శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ కి అడగకుండానే రెండుసార్లు లక్ష రూపాయలు సహాయం చేసి సత్యానంద్ వ్యక్తిగత అవసరాలను తీర్చారు 1993 లో పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కూడా కాదు.
  • 1998 లో తొలిప్రేమ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ లో విసి ఆర్ అనాథ ఆశ్రమానికి లక్ష రూపాయలు విరాళం.
  • 1998 లో షూటింగులో చనిపోయిన వ్యక్తికి లక్షా యాబై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
  • 1999 లో కార్గిల్ వార్ సైనికుల సంరక్షణ కొరకూ లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
  • 2005 లో సునామీ బాధితులకు బాను ఫ్రాంచైజీ ద్వారా ఆర్ధిక సహాయం అందించారు.
  • జల్సా సినిమా సమయంలో క్యాన్సర్ సోకిన చిన్నారులకు ఆర్థిక సహాయం, వైద్య ఖర్చులకు పూర్తిగా సహాయం అందించారు
  • బంగారం సినిమా సమయంలో చిన్నపాపకు గుండె ఆపరేషన్ కోసం 3 లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.
  • ప్రజారాజ్యం ప్రచార సమయంలో చనిపోయిన కార్యకర్తకు లక్షా 30 వేలు ఆర్థిక సహాయం అందించారు.
  • అనారోగ్యంతో చనిపోయిన అభిమాని వెంకటేష్ కుటుంబానికి 7 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
  • కిడ్ని వ్యాధితో బాధపడుతున్న సురేష్ అనే అభిమానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
  • ఖమ్మం జిల్లాలోని పాండు రంగాపురం జీసెస్ అనాధాశ్రమానికి లక్షా 10 వేలు సహాయం.
  • ఖమ్మంలో శ్రీజకు క్యాన్సర్ సోకితే 2 లక్షలు మరియు వైద్య సహాయం. అందుకే చనిపోతుంది అనుకున్న శ్రీజ బ్రతికి ఏ గుడికి వెళ్లినా మొక్కే మొదటి మొక్కు నా దేవుడు, మావయ్య పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని
  • దివ్యాంగుల రెండో కిక్రెట్ టోర్నమెంట్ కి 5 లక్షలు ఆర్ధిక సహాయం
  • బీద బ్రహ్మిన్స్ కుటుంబానికి చెందిన సత్తిరాజు, విజయకృష్ణ దంపతుల చిన్న కుమార్తె రేవతి కండరాల వ్యాధికి మైసూర్ పంపి పూర్తి వైద్య సహకారం 20 వేలు కుటుంబానికి టిక్కెట్స్ బుక్ చేశారు
  • ఆంధ్ర వర్ధమాన షూటర్ రేఖ కోచింగ్ కోసం 5 లక్షలు సహాయం.
  • అసిస్టెంట్ కెమెరామెన్ రవి భార్యకి ఆరోగ్యం బాగోకపోతే వైద్యం కోసం 25 లక్షలు ఆర్ధిక సహాయం.
  • ఆధునిక మహాభారతం రచయిత గుంటూరు శర్మ పుస్తకం సమాజానికి ఉపయోగపడుతుంది. పూర్తి ముద్రణ ఖర్చు మరియు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు.
  • కాకినాడ మీటింగులో చెట్టు కొమ్మ విరిగి చనిపోతే జనసేవాదళ్ నుంచి 5 లక్షలు ఆర్ధిక సహాయం.
  • సర్ధార్ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా వికలాంగులకు ఆర్థిక సహాయం.
  • హమాచల్ ప్రదేశ్ లో చనిపోయిన 24 మంది తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు లక్ష చప్పున 24 లక్షలు ఇవ్వడం జరిగింది.
  • యాసిడ్ దాడిలో గాయపడిన ప్రణీతకి ఉన్నత చదువులకు వైద్య ఖర్చులకు సహాయం మోరల్ సపోర్ట్ అందించారు
  • ప్రజారాజ్యంలో పార్టీకి సహాయ సహకారాలు అందించిన ఎన్నో వందల బీద కుటుంబాలకు ఆస్తులు అమ్మి ఆర్థిక సహాయం అందించారు పవన్ కళ్యాణ్.
  • విశాఖపట్నంలో కరెంట్ షాక్ లో మరణించిన అభిమానులు కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వడమే కాకుండా పిల్లల చదువుకు ఫీజులుకట్టడం.
  • ఆస్తులు కోసం కన్న తల్లిదండ్రులను తోబుట్టువులను కడతేర్చే ఈలోకంలో అన్న నాగబాబు కోసం డబ్బులు లేకున్నా గబ్బర్ సింగ్ సినిమా తీసి వచ్చిన 40 కోట్ల డబ్బులు ఇచ్చి అప్పులు తీర్చేశారు.
  • ఖమ్మంలో కష్టాల్లో ఉన్న అభిమాని కుటుంబానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం.
  • అరకు పర్యటనలో ఆంత్రాక్స్ వ్యాధి సోకి తామరతో గజ్జితో ఉన్న పిల్లల్ని ముద్దాడి అంటు వ్యాధి సోకిన పిల్లల్నిమరో మదర్ థెరిసా ఎత్తుకున్నారు. ఆంత్రాక్స్ కి మెడిసిన్స్, ఆహారం అందించారు. త్రాగునీటిని సొంత డబ్బుతో పరిశోధనకు పంపించారు.
  • అత్తారింటికి దారేది సినిమాకి ఇచ్చిన చెక్కులో 70% సొమ్మును నేషనల్ సెక్యూరిటీ ఫండ్ కి అందించారు.
  • గోపాల గోపాల సినిమా షూటింగ్ సమయంలో ఇంటి నిర్మాణం కోసం అభిమానికి 50 వేలు ఆర్ధిక సహాయం అందించారు.
  • కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి 11లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని గుబ్బల సతీష్ కి 50 వేలు ఆర్ధిక సహాయం అందించారు.
  • క్యాన్సర్ తో బాధపడుతున్న విష్ణుప్రియాకు 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
  • తుమ్మలపాలెం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే అభిమాని ప్రమాదశాత్తూ చనిపోతే లక్షరూపాయల ఆర్థికసహాయం అందించారు.
  • దామోదరం సంజీవయ్యా స్మారక భవనానికి కోటిరూపాయల విరాళం అందించారు.
  • కరోనా కష్ట కాలంలో ఆంద్రప్రదేశ్ కి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షలు కేంద్రానికి కోటిరూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
  • వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి కోటి పదిలక్షల రూపాయలు విరాళం అందించారు.
  • గుంటూరు పానకాల స్వామి గుడికి భారీ విరాళం అందించారు.
  • చిలుకూరి బాలాజీ స్వామి వారి ఆలయానికి 9 లక్షల రూపాయలు విరాళం అందించారు.
  • అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం 32 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
  • విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి 3 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
  • అన్నవరం దేవాలయానికి మరమ్మతులు కోసం 5 లక్షలు విరాళంగా అందించారు.
  • కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ విరాళం అందించారు.
  • అన్నవరం సినిమా షూటింగ్ అయ్యాక ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఎవరో తెలియని వ్యక్తికి యాక్సిడెంట్ అయితే దారిలో కారు ఆపి తన కారులో కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి నిరుపేద అని తెలుసుకుని బ్లాంకు చెక్కు ఇచ్చి వైద్య ఖర్చులు తానే భరించారు.
  • హైదరాబాదులో మానసిక వికలాంగుల ఆశ్రమాలకు భారీ విరాళాలు అందించారు.
  • పవన్ కళ్యాణ్ లెర్ణింగ్ సెంటర్ ఫర్ హ్యమన్ ఎక్సలెన్స్ ద్వారా పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ అందించారు, పేద విద్యార్థుల చదువులు కోసం లక్షరూపాయల విరాళం అందించారు.
  • ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబానికి 8లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
  • అండర్ 19 క్రికెట్ లో ఎదుగుతున్న వర్థమాన క్రికెటర్ షేక్ రషీద్ కు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
  • హీరోయిన్ సమంత ఏర్పాటు చేసిన ప్రత్యూష ఫౌండేషన్ కి మహేష్ బాబుతో కలసి ఆర్ధిక సహాయం అందిస్తూ ఉన్నారు.
  • మనం సైతం ఫౌండేషన్ కి ఆర్ధిక సహాయం చేసి యాక్టర్ సుభాషిణికి 2 లక్షలు క్యాన్సర్ వైద్యంకి సహాయం.
  • పావలా శ్యామల గబ్బర్ సింగ్ షూటింగులో కలిసి ఆరోగ్యం బాగోలేదు అనగానే లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం ఆదరించిన తీరు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు.
  • 2015 లో ప్రత్యేక హోదా కోసం అమరుడు అయ్యిన మునికోటి కుటుంబానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
  • కమిడియన్ కాదంబరి ఏర్పాటు చేసిన మనం సైతం ఫౌండేషన్ కి ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.
  • మాహాబుబ్ నగర్లో ప్రమాదానికి గురైన అభిమాని కొట్టే వెంకటేష్ యాదవ్ కి 5 లక్షలు సహాయం
  • కామన్ మెన్ ప్రోటక్షన్ ఫోర్స్ కి కోటి 20 లక్ష లు సహాయం.
  • సర్ధార్ ఆడియో ఫంక్షన్ లో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తానని ఆ సినిమా తగినంత స్థాయిలో ఆడక పోయినా తన సోంత బెంజ్ కారును 2 కోట్లకు అమ్మి వైద్యం చేయించారు.
  • తమిళనాడు లో వరదలు నిమిత్తము తనకి ఉన్న రెండో బెంజ్ కారును అమ్మి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. బెంజ్ కార్లు రెండు అమ్మి స్కోడా కారుకే పరిమితం అయ్యారు.
  • క్రీడాకారుడు సురేష్ కి ట్రైన్ యక్షడెంట్ అయ్యితే 5 లక్షలు సహాయం.
  • కోమరంపులి క్రేయేటివ్ డైరెక్టర్ సూర్యకి సినిమా రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం జరిగింది.
  • కామిడీ యాక్టర్ ఆంజనేయులు కుటుంబ పరిస్థితి తెలుసుకుని గబ్బర్ సింగ్ లో హరీష్ శంకర్ కి చెప్పి పాత్ర ఇప్పించి ఆదుకున్నారు.
  • 2012 లో ఉత్తరాఖండ్ వరదలకి 20 లక్షలు సహాయం.
  • 2015 లో విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫానుకు 50 లక్షలు ఆర్ధిక సహాయం చేసారు.
  • జానీ సినిమా ప్లాప్ అయ్యితే డిస్టిబ్యూటర్ సుధాకర్ రెడ్డికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.
  • బైకర్ గోదా సతీష్ కి 5 లక్షలు ఆర్ధిక సహాయం
  • సినిమాల్లో హెయిర్ స్టయిల్ చేసిన రాంకి సెలూన్ షాప్ కి ఓపెనింగ్ కి వెళ్లి కొంచెం మొత్తం ఆర్ధిక సహాయం.
  • కోట్లు వచ్చే యాడ్స్ వదిలి చేనేత కార్మికులకు అంబాసీడర్ గా వ్యవహరించడం
  • ఆజ్ఞాత వాసి షూటింగ్ లో సరదాగా ఫోటో దిగితే ఆయన కాశీలో జాబ్ చేస్తూ చనిపోయారని పేపర్ లో చూసిన వెంటనే ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకుని లక్ష ఆర్ధిక సహాయం చేశారు.
  • హైదరాబాద్ నగర శివారులో షూటింగ్ జరుగుతుంటే రోడ్డు పక్కన పనిచేసే ఒక ఆవిడ సెక్యూరిటీ వారిస్తున్నా వెళ్లి పవన్ కాళ్ళ దగ్గర తన బిడ్డకి ప్రాణం పోయండి దేవుడా ఒంట్లో బాగోలేదు అని ఏడిస్తే వెంటనే ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకుని మహేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు పిల్లలకు వైద్యం చేసే రెయిన్బోలో ఆసుపత్రికి పంపించి వైద్యం చేయించి బ్రతికించి తిరిగి వారి ఇంటికి కూడా వెళ్లారు.
  • ఆర్ట్ డైరెక్టర్ శేషగిరి అబ్బాయికి ఒంట్లో బాగోక పోతే రైన్బో ఆసుపత్రిలో వైద్యం చేయించి ప్రాణం పోశారు. రెయిన్బోలో వైద్యం అంటే ఖర్చు అందరికి తెలుసు.
  • 2009 లో ఆదిలాబాద్ తండాలులో మారుమూల ఉన్న కొలంగూడా, గోండుగూడా గ్రామాల్లో నీరులేక తండా వాసులు ఇబ్బంది పడుతుంటే సొంత డబ్బుతో రెండు మంచినీటి బోర్లు ఏర్పాటు చేశారు.
  • బద్రి సినిమాలో వాడిన బైకులు వేలం వేసి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి విరాళం ఇవ్వడం జరిగింది.
  • 2013 లో నేషనల్ కలమిటి కి ఆర్ధిక సహాయం
  • పబ్లిక్ మీటింగ్ వెళ్లి నప్పుడు హైదరాబాద్ లో తోపులాటలో మరణించిన అభిమాని కుటుంబానికి లక్షా 50 వేలు సహాయం.
  • గోపాలా గోపాలా మూవీ ఆడియో లాంచ్ తిరుగు ప్రయాణంలో గాయపడ్డ కొత్తూరు శ్రీనివాస్ కుటుంబానికి వైద్య ఖర్చులు మరియు 50 వేలు సహాయం.
  • దారుణహత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం అందించారు.
  • పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బంది కుటుంబాల కోసం 13 లక్షల 50 వేలు రూపాయలు ఖర్చు చేశారు.
  • క్యాన్సర్ తో బాధపడుతున్న ఉడిదయ్యకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
  • వాయిద్య కళాకారుడు కిన్నెర మొగలయ్యకు 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
  • ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న తాపీమెస్త్రి బ్రహ్మాజీ కుటుంబానికి లక్షరూపాయల విరాళంగా అందించారు.
  • సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామపంచాయతీకి 50 లక్షల ఆర్ధిక సహాయం అందించారు.
  • రోడ్లు విస్తరణ పేరుతో జనసేన సభకు స్థలం ఇచ్చిన కారణంగా నష్టపోయిన ఇప్పటం గ్రామస్తులకు ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించారు.
  • జంగారెడ్డిగూడెం కల్తీ సారా బాధిత కుటుంబాలకు 20 వేలు చొప్పున 60 కుటుంబాలకు ఆర్థికసహయం అందించారు.
  • కిలిమంజారో అధిరోహించిన ఆశా దాళ్వాయికి లక్షా యాబై వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
  • సినీ కళాకారులకు షూటింగ్ సమయంలో మంచి భోజనాలు పెడుతున్న ప్రొడక్షన్ చీఫ్ పచ్చల ప్రకాష్ కి 20 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయంగా అందించారు.
  • ఎందరో చిన్న చిన్న ఆర్టిస్టులకు తన సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆదుకున్నారు.
  • 75 ఏళ్ల స్వాసంత్ర్య భారతంలో సుమారు 1100 రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం ఆలోచన చేయలేదు మొదటిసారిగా కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమాను ఇవ్వడం కోసం రెండేళ్లలో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాద పాలసీలు చేయించారు.
  • దేశంలో కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతుల ఆత్మహత్యలు ఎన్నో జరిగాయి కానీ మొదటిసారిగా 3 వేల మంది రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 30 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
  • చనిపోయిన రైతు కుటుంబాల పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది.
  • గోదావరి పడవ ప్రమాద బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందించారు.
  • ఇవన్నీ సహాయం పొందిన వ్యక్తులు చేప్తే బయటకు వచ్చాయి బయటకు రానివి ఇంకెన్నో.
  • ఐటి సోదాల్లో పాల్గొన్న అధికారులు మా సర్వీసులో ప్రజల కోసం ఇన్ని దానాలు చేసిన వ్యక్తిని మొదటిసారి చూస్తున్నాం అని ఆశ్చర్యపోయారు అంటే పవన్ కలియుగ కర్ణుడు అనడంలో సందేహం లేదు కదా.
  • ఎప్పుడైనా చంద్రబాబుగాని, జగన్మోహన్ రెడ్డి కానీ రూపాయి దానం చేశారు అని ఎక్కడైనా చూశారా కనీసం విన్నారా..? 500 కోట్లు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని సింగపూర్ లో ఫైవ్ స్టార్ హోటళ్లు, హెరిటేజ్ వ్యాపార సంస్థలు, జగన్ కి లోటస్ పాండు, బెంగుళూరు ప్యాలెస్, లక్షల ఎకరాల భూములు, పవర్ ప్రాజెక్టు, సిమెంటులాంటి వందల కంపెనీలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు
  • 2 ఎకరాల చంద్రబాబు, 2014 లో ఇంటిని బేరం పెట్టిన వైఎస్ కుటుంబాలకు వేల కోట్లు కాదు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి.
  • 1993 నుంచి గుప్త దానాలు చేసి టాక్స్ కట్టడానికి కూడా డబ్బులు లేక అప్పు చేసిన పవన్ కావాలో, వేల కోట్లు రాజకీయాలు మీద ప్రజల సొమ్మును దోచి సంపాదించిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలు కావాలో మీరే నిర్ణయం తీసుకోండి. మనసాక్షి తో ఆలోచించి 2024లో ఓటు వేయండి.
    కోటిపల్లి కాలం
    కోటిపల్లి అయ్యప్ప
    ఎం.టెక్, ఎం.బి.ఏ, ఎల్.ఎల్.ఎం(క్రిమినల్ లా)
    ఎం.ఏ ఎకనామిక్స్, ఎం.ఏ మాస్ జర్నలిజం
    ఫోన్:8897560199