ప్రజల ఆశీస్సులతో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్

  • పవనన్న ప్రజాబాట నాలుగవ రోజు

ఆత్మకూరు నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా నాలుగవ రోజున 1వ వార్డ్ ముస్తాపురంలో జరిగినది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్ ఆ సమస్యల పట్ల తమ వంతు పోరాటం చేస్తామని ముస్తాపురం ప్రజలకు భరోసా కల్పించారు. ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ డ్రైనేజీ మరియు మంచి నీళ్ళు మొదలగు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం జరిగింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మనసున్న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజల సమస్యలన్నీ తీర్చగల శక్తి ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నదని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దాడి భాను కిరణ్, సురేంద్ర, వంశీ, చంద్ర, ప్రసాద్, శేఖర్, అనిల్, రాకేష్, మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.