అగ్గిచేనుపల్లి నుండి గంటావారిపల్లి రోడ్డు వరకు రోడ్డు వేయాలని జనసేన డిమాండ్

  • రెన్యువల్ అయిందా? అయితే ఎందుకింత జాప్యం :
  • రెన్యువల్ కాలేదా? ఎందుకు టెండర్ కి పిలవలేదు??
  • ఎవరు కారకులు? కాంట్రాక్టర్ ఎవరు??
  • ప్రజలు ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్నారు :
  • ఉప ముఖ్యమంత్రి పెళ్లిరోజు కానుకగా ఈ రోడ్డును వేస్తే సంతోషిస్తాం
  • జనసేన ఇంచార్జి డా యుగంధర్ పొన్న.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, అగ్గిచేనుపల్లి నుండి గంటావారిపల్లి రోడ్డు వరకు, రోడ్డు వేస్తారా?? వేయరా?? అని నియోజకవర్గం ఇంచార్జి డా యుగంధర్ పొన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రెన్యువల్ అయిందా? అయితే ఎందుకింత జాప్యం అని ప్రశ్నించారు. ఒకవేళ రెన్యువల్ కాలేదా? ఎందుకు టెండర్ కి పిలవలేదని అడిగారు. దీనికి ఎవరు కారకులు అని, దీనికి కాంట్రాక్టర్ ఎవరని అడిగారు. ఆ వివరాలు అందిస్తే ఆ కాంట్రాక్టర్ ఇంటి ముందు జనసైనికులతో మహాధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పెళ్లిరోజు కానుకగా ఈ రోడ్డును వేస్తే సంతోషిస్తామని తెలిపారు. తొందరలో నియోజకవర్గ స్థాయి నాయకుల సమక్షంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శులు వెంకటేష్, రాఘవ, మండల ప్రధాన కార్యదర్శులు సతీష్, మండల కార్యదర్శులు రాజు, గిరి, హిమగిరి, దినకర్, సతీష్, శరత్, వినోద్, జనసేన నాయకులు, జసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.