పవన్ కళ్యాణ్ కి జన సైనికులు, వీర మహిళలు అంటే ఎంత ఇష్టమో తెలియజేయటానికి క్రియాశీలక సభ్యత్వం విధివిధానాలే నిదర్శనం: గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు మునిసిపల్ పరిధిలో ఉన్న 16వ వార్డ్ ఏటుకూరు గ్రామంలో నివసిస్తున్న దిరిశాల పుండరి కక్షా ప్రసాద్, జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. ఈ విషయం తెలుసుకుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు నియోజకవర్గం నాయకులు చట్టాల త్రినాధ్, దాసరి వాసు, ఉప్పు రత్తయ్య, తన్నీరు గంగరాజుని అడిగి పూర్తి సమాచారం తీసుకుని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గాయపడిన కార్యకర్త యొక్క కుటుంబానికి 50 వేల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకి పంపించి వారికి అందజేయవలసినదిగా సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తో వారి ఇంటికి కలసి వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా దిరిశాల పుండరీకాక్ష ప్రసాద్ కి మరియు వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం తెలిపివారికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసి పవన్ కళ్యాణ్ పంపిన చెక్కుని వారికి అందజేయడం జరిగింది. దిరిశాల పుండరీకాక్ష ప్రసాద్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమకు చేసిన సహాయం మర్చిపోలేనిది అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయుబ్ కమల్, మార్కండేయ బాబు, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, ఉప్పు రత్తయ్య, చట్టాల త్రినాధ్, సిరిగిరి శ్రీనివాసరావు, కొర్రపాటి నాగేశ్వరావు, శిఖా బాలు, వల్లెం శ్రీను, గుంటూరు టౌన్ అధ్యక్షులు నేరెళ్ల సురేష్, 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మి దుర్గ, 47 వ డివిజన్ కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, డేగల ఉదయ్, 16వ డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, టౌన్ కమిటీ సభ్యులు చింత రాజు, కటకం శెట్టి విజయలక్ష్మి, సూరిశెట్టి ఉపేంద్ర, పావులూరి కోటి, నిశ్శంకరావు నవీన్, మధులాల్, గంగరాజు మరియు గ్రామ జన సైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు పాల్గొన్నారు.