రాజంపేటలో అట్టహాసంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన యువనాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజంపేట తిరుపతి రోడ్డు ఇండియన్ గ్యాస్ ప్రక్కన ఉండేటటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరం చాంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, వెంకటేశ్వర్లు, అతిగారి దినేష్ పాల్గొని భారీ కేక్ కట్ చేయడం జరిగినది. తదుపరి రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ నందు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ ప్యాకెట్లు అందించడం జరిగింది. తర్వాత రాజంపేట పరిసర ప్రాంతాలలో నివసించేటటువంటి నిస్సహాయ వృద్ధులకు భోజనం ప్యాకెట్లను అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భాస్కర పంతులు, కత్తి సుబ్బరాయుడు, బాల సాయి, నంద్యాల హరి, గోపి, వెంకటయ్య, వీరయ్య ఆచారి, హేమంత్, చంగల్ రాయుడు, కిషోర్, జనసేన వీర మహిళలు జండా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.