జయరాం రెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

అనంతపురం: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం నందు బాలికల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతపురం నగరంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహమునందు గత కొంతకాలంగా కరెంటు కోతల వలన ఉక్కపోతతో దాదాపు 160 మంది బాలికలు చదువుకోడానికి ఇబ్బంది పడుతున్నారు, వీరి ఇబ్బందులను గమనించి లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు.. వీరి సౌకర్యార్థం ఇన్వర్టర్, బాలికల భద్రత కోసం సీసీ కెమెరాలు, నోట్ బుక్స్ మరియు పెన్నులు” డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, రొల్ల భాస్కర్, ఆకుల రాఘవేందర్, వీరమహిళలు జయమ్మ, అనసూయ, దాసరి సరిత, ఇమామ్ హుస్సేన్, నౌషాద్, గిరి, వెంకటనారాయణ, మేదర వెంకటేష్, నారాయణపురం రమణ, శీన, నాగార్జున, ఆకుల ప్రసాద్, అశోక్, సంతోష్, రాయల్ నవీన్, దేవరాయల విజయకుమార్, భవాని నగర్ మంజునాథ్, ప్రవీణ్ కుమార్ మరియు జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, జనసేన వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.