జనసేన పార్టీలో చేరిన పవన్ నెట్టి

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు టైలర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పవన్ నెట్టి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. కత్తి మమత ఆహ్వానం మేరకు తిరుపతిలో గల వారి స్వగృహంలో వారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయల దక్షణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడు డా. మాసి క్రిష్ణమూర్తి మరియు చిత్తూరు జిల్లా కార్యదర్శి హేమంత్ కుమార్, అజయ్ మాథ్స్ అకాడమీ అధ్యక్షులు అజయ్ ప్రసన్న, చైతన్య రాయల్, గుంతకల్లు జనసేన పార్టీ నాయకులు బోయ విరేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ నెట్టి మాట్లాడుతూ నన్ను జనసేన పార్టీ లోకి ఆహ్వానించిన డా. కత్తి మమతకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, పార్టీ విది విదినాలను గౌరవిస్తూ పార్టీ కోసం పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసారు.