కిడ్నీ వ్యాధి భాదితురాలికి పవన్ సేన ఆర్థిక సహాయం

ఇచ్చాపురం: కవిటి మండలం, కర్రిపుట్టిగ గ్రామానికి చెందిన కర్రీ రామ లక్ష్మమ్మ గత కొద్దిరోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. లక్ష్మమ్మ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే గానీ ఉంది. సాయం చేసే దాతల కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకొన్న పవన్ సేన సంస్థ వారు జనసైనికుల సాయంతో ఆ కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి పవన్ సేవా సంస్థకి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.