జనసైనికునికి ఆర్ధికసాయమందించిన పవన్ సేన సమితి

ఇచ్చాపురం మండలం, బొడ్డకలి గ్రామంలో జనసైనికుడు లండ శ్రీనివాసుకీ గత కొద్ది రోజుల కిందట అనారోగ్యం కారణంగా హాస్పటల్ ఖర్చుల నిమిత్తమ మూడు లక్షల వరకూ ఖర్చయ్యింది. శ్రీనివాసుకి అండగా ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన నాయకులు పవన్ సేన సమితి తరపున నాలుగు వేల రూపాయలు జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి చేతుల మీదుగా లండ శ్రీనివాస్ రెడ్డికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొడ్డకలి జనసైనికులు డంబురు రెడ్డి శ్రీధర్ కృష్ణ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.