ఆకేపాడులో జోరుగా కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట

  • పవనన్న ప్రజా బాట కార్యక్రమం 87వ రోజు

రాజంపేట నియోజకవర్గం, ఆకేపాడు పంచాయతీలోని పలు గ్రామాలైన కట్టకిందపల్లి, నారం రాజు పల్లి, పెద్దూరు, అయ్యప్ప రాజు గారి పల్లి, కమ్మపల్లి లలో రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట 87వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజంపేట జనసేన నాయకులు ముందుకు తీసుకు వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, వీరయ్య ఆచారి, హేమంత్, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష మాధవి తదితరులు పాల్గొన్నారు.