30వ వార్డులో పవనన్న ప్రజా బాట కార్యక్రమం

  • 53వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట
  • ప్రతి గడప గడపకు వెళ్లిన డాక్టర్ కందుల
  • నవ వధువుకు బంగారు తాళి బొట్టు, పట్టు బట్టలు అందజేత

దక్షిణ నియోజకవర్గం: జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలు నిర్వరామంగా కొనసాగుతున్నాయి. రాజకీయాలకతీతంగా చేస్తున్న ఆయన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 53వ రోజుకు చేరింది. దక్షిణ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 53వ రోజు కార్యక్రమంలో భాగంగా 30వ వార్డు కొత్త జాలారిపేట ప్రాంతానికి చెందిన నవవధువు హేమకు బంగారు తాళిబొట్టు, పట్టు బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. తాను రాజకీయాల లోకి రాక ముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగించానని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికి సాయం చేయడమే తన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నవవధువు హేమకు బంగారు తాళిబొట్టు, పట్టు బట్టలు అందజేయడం జరిగిందన్నారు. తాను చేస్తున్న మంచి పనులకు అటు కుటుంబ సభ్యులు, ఇటు జనసేన నాయకులు, వీర మహిళలు, వీరసైనికుల పూర్తి సహకారం అందిస్తూన్నారని వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తన సేవలను మరింతగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు జనసేన వెంటే ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నవ వధువు హేమ, ఆమె తల్లిదండ్రులు మారమ్మ, పోతరాజుతో పాటు జన సైనికులు, వీరమహిళలు ఊసిరికాయల యజ్ఞశీ, జోగిరాజు, శ్రీహరి, అప్పారావు, అంతోని, గాజుల శ్రీను, సూరి, ప్రసాద్, మనోహర్, పవన్, నూకరాజు, మంగ, లలిత, రాజేశ్వరి, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.