దిగ్విజయంగా కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట

  • పవనన్న ప్రజాబాట 108వ రోజు
  • రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు నందలూరు మండలంలోని పోత్తపి కుంపినిపురంలో 108వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు దోపిడీలు భూదంధాలు తప్ప ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని ఈ పరిపాలనకు ఓట్ల రూపంలో బుద్ధి చెబుతామని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికలలో జనసేనకు మద్దతు తెలుపుతామని గ్రామ ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, గోపి, ఆచారి, చౌడయ్య, శ్రీనివాసులు, జనసేన వీరమహిళలు జడ్డ శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.