డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట

విశాఖ దక్షిణ నియోజకవర్గం, ఉగాది పర్వదినం సందర్బంగా బుధవారం ఉదయం 35వ వార్డు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి నుంచి పవనన్న ప్రజా బాట ప్రారంభమైంది. దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 35వ వార్డులోని పూర్ణ మార్కెట్, కల్లుపాకల వీధి, ప్రసాద్ గార్డెన్ వంటి ప్రాంతాలలో పవనన్న ప్రజా బాట కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మంచిని వివరించారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమో లేదని తెలిపారు. అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారని పేర్కొన్నారు. పెరిగిన నిత్యవసర ధరలతో ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆదేశాలతో, సూచనలతో తాము కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చామని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రజలు కూడా జనసేన వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అరుణ, కోమలి, భార్గవి, రాము, జి.లక్ష్మి, కనక, వర్షిణి, పార్వతి త్రినాధ్, రఘు, గాజులు శ్రీను, ప్రసాద్, ఆడప సత్తిబాబు, కనకరాజు, కొల్లి గణేష్, నగేష్, తరుణ్, పవన్, అశోక్, హరి, మణికంఠ, రమేష్, బి.సాయి, నవీన్, నాగేంద్ర, తెలుగు అర్జున్, మని, సూరి, వర, జానకి, జాన్సీ, దుర్గ, ఎర్రంశెట్టి సురేష్, గరికిన రవి, ప్రణీత్, అరుణ్, ఎస్.అప్పారావు, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.