ప్రపంచంలోని అత్యంత పురాతన ధర్మం మన సనాతన హైందవ ధర్మం: కేశవభట్ల విజయ్

తాడేపల్లిగూడెం, స్థానిక 3 వ వార్డు జనసేన నాయకులు గొంప లోవరాజు ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి శ్రీరాంలాల మందిరంలో ప్రాణప్రతిష్ట పూజిత అక్షింతలు స్థానిక 3 వ వార్డులో ఉన్న ప్రతీ ఇంటికి పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అద్యక్షులు మరియు జనసేన జిల్లా కార్యదర్శి కేశవబట్ల విజయ్ హాజరు అయ్యారు. ఈ అక్షింతల కలశమును లోవరాజు, అబ్బులు, విజయ్, శిరస్సు మీద మోసి ప్రతి ఇంటికి చేరవేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కేశవభట్ల విజయ్ మాట్లాడుతు 500 వందల ఏళ్ళుగా ప్రతి ఒక భారతీయుడు ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరాములు వారి ఆలయం జనవరి 22 నా అత్యంత ప్రతిష్టాత్మంగా ప్రారంభం అవుతుంది అని, ప్రపంచంలోని అత్యంత పురాతన ధర్మం మన సనాతన హైందవ ధర్మం అని ప్రతి ఒక్కరూ కూడా జనవరి 22 న ప్రతి ఇంటిలో కూడా దీపాలు వెలిగించి రాముని కృపకు పాత్రులు అవ్వాలి అని ఆ శ్రీరామ చంద్రుని అక్షింతలు మోసే అదృష్టం జీవితంలో చేసుకున్న పుణ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమరాడ చిన్న, సారిపల్లి రమణ, ఎన్. సూర్య ప్రకాష్, ఎర్రంశెట్టి ప్రసాద్, నెక్కాలకు సాయినాథ్, సతీష్ రాచకొండ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.