నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో
శ్రీమతి జనసేన రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రియా సౌజన్య మరియు ఉండ్రాజవరం మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా గడపగడపకి జనసేన సిద్ధాంతాలని ఆశయాలని తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాల్దరి ఆడపడుచులు హారతులతో ఎదురు రావడం సంతోషకరం. ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే 2024లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవడం ఖాయమని కాల్దరి మహిళల్లో వచ్చినటువంటి చైతన్యం నియోజవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడలోను రావాలని ప్రియా సౌజన్య అభిప్రాయపడ్డారు. నాకు టిక్కెట్ ఇస్తే పదింతలు పనిచేస్తాను మరొకరికి ఇస్తే వంద ఇంతలు పనిచేస్తాను తల తెగేవరకు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసమే పనిచేస్తానని ప్రియా సౌజన్య శపథం చేశారు. కాల్దరి గ్రామంలో కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా ఉన్న నాగేశ్వరరావుకి అక్కడ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు సహాయంతో 3000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సదా వెంకటేష్, పెండ్యాల ఎంపీటీసీ ఇంద్రా గౌడ్, నిడదవోలు మండలం నాయకులు ఏ.ఎన్.ఆర్, కానూరు ఎంపీటీసీ సీతయ్య నాయుడు, సావరం జనసేననాయకులు తాతాలు, పందలపర్రు గ్రామ అధ్యక్షులు కర్రి వినోద్ కుమార్, ఇంటి వెంకట్, మేడా మల్లిఖార్జున్, పెరవలి మండల జనసైనికులు, నిడదవోలు మండల జనసైనికులు, ఉండ్రాజవరం మండల జనసేన నాయకులు గరిమెళ్ళ కొండలరావు, నిమ్మల సాంబమూర్తి, ఆకేటి రామారావు, దాసరి శ్రీను, దాసరి సుబ్బు, దుర్గా మల్లేశ్వర రావు, మనోజ్ మరియు ఉండ్రాజవరం మండల జనసైనికులు, ముఖ్యంగా ముందుండి నడిపించిన కాల్దరి ఆడపడుచులు, కాల్దరి జనసైనికులు కృష్ణ, స్టాలిన్, శేఖర్ మరియు వీర మహిళలు, జనసైనికులకి పేరుపేరునా ధన్యవాదాలు.