జయప్రకాష్ ‌రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి తన తరుఫున మరియు జనసేన తరుఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని జయప్రకాష్‌రెడ్డి చూపారన్నారు.   

నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ప్రతినాయకుడిగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్ని మెప్పించారన్నారు. ‘గబ్బర్‌సింగ్‌’లో పోలీస్ కమిషనర్‌గా ఆయన నటించారన్నారు. పాత్ర ఏదైనా చక్కగా ఒదిగిపోయేవారన్నారు. చిత్ర రంగంలో ఎంత బిజీగా ఉన్నా నాటక రంగాన్ని మాత్రం మరువలేదన్నారు. తెలుగు సినీ, నాటక రంగాన్ని మాత్రం మరువలేదని పవన్ పేర్కొన్నారు.