వార్నింగ్ ఇచ్చిన సోనూ సూద్

సోను సూద్‌ పేరు మీద నకిలీ ట్విటర్ ఖాతా నిర్వహిస్తున్న ఓ నెటిజెన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసాడు. ”ఫేక్ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్నందుకు త్వరలోనే అరెస్టు అవుతావు మై డియర్” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ”ఇకకైనా ఒకరి పేరు ఉపయోగించి మరొకరిని ట్వీట్ చేయడం మానుకోవాల్సిందిగా హితవు పలికిన సోనూ సూద్.. అప్పుడే నువ్వు బాగుపడతావ్” అంటూ గట్టిగానే మందలించాడు. సదరు నెటిజెన్‌కు ట్విటర్ ద్వారానే సోను సూద్‌ ఈ హెచ్చరికలు చేశాడు.

కరోనావైరస్ వ్యాప్తి అనంతరం లాక్ డౌన్ విధించినప్పటి నుంచి వలస కార్మికులకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదవారికి, విదేశాల్లో చిక్కుకుపోయి స్వదేశానికి తిరిగిరాలేకపోయిన భారతీయులకు ఎంతోమందికి కాదనకుండా, లేదనకుండా సహాయం చేసిన సోను సూద్‌ అంటే ఇప్పుడు చాలామందికి గౌరవం, నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే ఇప్పటికీ చాలామంది అతడి సహాయం కోరుతూ ట్విటర్ ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోనూ సూద్ పేరిట ఫేక్ ట్విటర్ ఎకౌంట్ నిర్వహిస్తున్న ట్విటర్ యూజర్స్.. అతడి సహాయం కోరిన వారి వివరాలు తెలుసుకుని వారిని మోసం చేసేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సోను సూద్‌.. నేరుగా వారికే గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా త్వరలోనే అరెస్ట్ అవుతావు అంటూ వారికి ముచ్చెమటలు పట్టించారు.