పెదఏరుకపాడు గ్రామ సమస్యలు తీర్చాలి- ఆర్కే వారియర్స్ నిరసన

కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణ స్థానిక 25వ వార్డు పెదఏరుకపాడు గ్రామంలో మంచినీటి పైపు లీకు వల్ల నీరు రోడ్డు మీదకు చేరి రోడ్లు గుఒతులమయం కావడంతో ప్రజలు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడడంతో ఆ సమస్యని గుర్తించి ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వాటర్ పైపు లీకై ఆ నీరు రోడ్డు మీద చేరడంతో రోడ్లు గుంతల మయం కావడంతో ప్రజలు మరియు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఆ సమస్యను గుర్తించి మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వార్డుల్లో ఏ సమస్య వచ్చినా సచివాలయం సిబ్బందికి తెలియజేస్తే ఆ సమస్యని వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చారని కానీ గుడివాడ పట్టణంలో సచివాలయం సిబ్బంది మరియు వాలంటరీ వ్యవస్థ ఏ సమస్యను గుర్తించట్లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆపదకాలకు ఈ పథకాలకు దృష్టి సారించకుండా కనీస మౌలిక వసతులు మీద దృష్టి పెట్టాలని కోరారు. ఈ వాటర్ పైపు మరమ్మతులు చేసి నీరు రాకుండా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, మట్ట జగదీష్, నాగసాయి, చరణ్ తేజ్, శివ, చరణ్, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.