విశాఖ ఘటనపై వైసీపీ మంత్రులు మరియు పోలీస్ వ్యవస్థపై విరుచుకుపడ్డ పెనుకొండ జనసేన

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గ కేంద్రం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు కుమార్, రాజేష్ పెనుకొండ మండల కన్వీనర్ మహేష్ సోమందేపల్లి మండల కన్వీనర్ జబిఉల్లా మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని విశాఖలో జనసేన నాయకులను అక్రమంగా అరెస్టులు చేసారు మీరు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మీలాగా అప్పటి ప్రభుత్వం అడ్డుకుని ఉంటే ఒక అడుగయినా ముందుకు వేసేవారా వైసీపీ గర్జన అట్టర్ ప్లాప్ అవ్వడంతో జనసేనని కోసం భారీ జనసందోహం రావడంతో మీరు జిర్ణించుకోలేక, ఇక రాష్ట్ర మంత్రులైతే సంస్కారం లేకుండా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి గాలి కూతలు భూతులు కూస్తున్నారని ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనసేన పోరాటాలు రెట్టింపు అవుతాయి కానీ భయపడే ప్రసక్తే లేదు ఇలాగే ప్రవర్తిస్తే రోడ్లు మీదకు వచ్చి ఉద్యమాలు చేయాల్సివస్తుందని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారు 2024లో మీకు రాజకీయ సమాధి కడతారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారం, కొల్లప్ప, వీరమహిళ శిరీష, యూత్ లీడర్ మల్లేష్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మండల కార్యదర్శి విజయ్ సంతోష్, వెంకటేష్, రొద్దం నాయకులు గంగాధర్ ఎం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.